కుంభమేళా అతి పెద్ద కేస్ స్టడీ..హార్వర్డ్
కుంభమేళా నిర్వహణ వ్యవస్థకు సంబంధించిన మేనేజ్‌మెంట్ కేస్ స్టడీస్‌పై ఇటీవల హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అధ్యయనం చేసింది. దానికి మెయింటెనెన్స్, రాబడి, ఖర్చులు వంటి లాజిస్టిక్స్ చూసి ఆశ్చర్యపోయింది. ప్రపంచంలోనే అతిపెద్ద మేనేజ్‌మెంట్ కేస్ స్టడీగా పనికొస్తుందని వ్యాఖ్యానించింది. ఈ విషయాన్ని అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇటీవల తన కుటుంబంతో కలిసి కుంభమేళాలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు విస్తరించిన తనకు ఈ కుంభమేళా నిర్వహణ ఎంతో ఆశ్చర్యపరిచిందని పేర్కొన్నారు. కోట్ల మంది వచ్చే ఈ మహా కుంభమేళా అనేది ప్రకృతి దృశ్యకావ్యం అని వ్యాఖ్యానించారు. గంగా,యమునా, సరస్వతీ మహానదుల సంగమం వద్ద 200 మంది మిలియన్ల మంది అంకిత భావంతో ఆధ్యాత్మక సేవలో నిమగ్నమవడం అనేది ఆత్మల సంగమం అని పేర్కొన్నారు. అధికారులు, వాలంటీర్లు ఎంతో అంకితభావంతో పనిచేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. సాధువుల వంటి జ్ఞానుల నుండి నిరుపేదలు, సంపన్నులు, సెలబ్రిటీలు, నాయకులను అందరినీ ఈ కుంభమేళా ఆకర్షిస్తోందన్నారు. ఆయన ఇటీవల ఇస్కాన్ ఏర్పాటు చేసిన భోజన శిబిరంలో పాల్గొని కుంభమేళాలో భక్తులకు స్వయంగా భోజనం వడ్డించారు.
