సైఫ్ దాడి కేసులో బిగ్ ట్విస్ట్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో మరో ట్విస్ట్ తో విచారణ కొనసాగుతోంది. దాడి జరిగిన ప్రదేశంలో లభించిన ఫింగర్ ప్రింట్స్ తో నిందితుడు షరీఫుల్ ఇస్లాం వేలిముద్రలు మ్యాచ్ కావడం లేదని వార్తలొస్తున్నాయి. ఇన్వెస్టిగేషన్ టీం అక్కడ దాదాపు 19 ఫింగర్ ప్రింట్స్ ని సేకరించింది. వాటిల్లో ఏ వేలిముద్ర కూడా నిందితుడి ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ కావట్లేదని ఫోరెన్సిక్ బృందం తెలిపినట్లు సమాచారం. తదుపరి పరీక్షల కోసం మరోసారి ఘటనా స్థలం నుంచి మరిన్ని వేలిముద్రల నమూనాల్ని సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు.