ఆ పులిని చంపేయండి
పులి ప్రజలపై పగబడితే…ప్రభుత్వం పులిపై పగపట్టింది.ఈ ఘటన కేరళ రాష్ట్రం వయనాడ్‌లో చోటు చేసుకుంది. వయనాడ్ అటవీ ప్రాంతంలో ఓ గిరిజ మహిళను పెద్ద పులి దాడి చేసి చంపి తినేసింది.దీనికి సంబంధించిన కథనాలు,ఫోటోలు సోషల్ మీడియాలో,డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్‌లో వైరల్ కావడంతో వాటిని చూసిన ప్రభుత్వం తక్షణమే ఆ పులిని చంపేయండి ( షూట్ ఎట్ సైట్) అంటూ ఆదేశాలిచ్చేసింది. పక్కా మ్యాన్ ఈటర్ గా మారిపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ఇదే పులి గతంలోనూ ఇద్దరిపై దాడి చేసింది.దీంతో వయనాడ్ గిరిజన వాసులు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు.ఈ నేపథ్యంలో షూట్ ఎట్ సైట్ ఆర్డర్ ఇచ్చేసింది కేరళ ప్రభుత్వం