Home Page SliderTelangana

రేవంత్ రెడ్డికి సంక్రాంతి ఆఫర్..

ఫార్ములా – ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఈడీ ఎదుట హాజరయ్యారు. దాదాపు 7 గంటల పాటు కేటీఆర్‌ను ఈడీ ప్రశ్నించింది. విచారణ ముగిసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తాను ఏ తప్పు చేయకున్నా చట్టాలను గౌరవించే పౌరుడిగా విచారణకు వచ్చానని, ఒక్క అర పైసా కూడా అవినీతి చేయలేదని స్పష్టం చేశారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఏసీబీ కేసు పెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. ఏసీబీ కేసు పెట్టింది కాబట్టి.. ఈడీ కూడా ప్రశ్నించిందన్నారు. ఏసీబీ, ఈడీ సంస్థల ప్రశ్నలు ఒకే రకంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఏసీబీ వేసిన ప్రశ్నలను తిప్పి తిప్పి అడిగారని చెప్పారు. నేను, రేవంత్‌ రెడ్డి.. న్యాయమూర్తి ముందు కూర్చుంటాం.. దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డి రావాలని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డికి సంక్రాంతి ఆఫర్ ఇస్తున్నా. మా ఇద్దరికీ లైవ్ లో లై డిటెక్టర్ టెస్ట్ పెట్టండి.. తేదీ, సమయం, స్థలం రేవంత్ రెడ్డి డిసైడ్ చేయ్. మళ్లీ విచారణకు రావాలని ఈడీ చెప్పలేదు.. కానీ పిలిస్తే తప్పకుండా వస్తానన్నారు కేటీఆర్.