సెంట్రల్ జైలులో చైనా డ్రోన్ కలకలం
మధ్య ప్రదేశ్ లోని జైలులో చైనా డ్రోన్ కలకలం రేపింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సెంట్రల్ జైలులో హైరిస్క్ బ్యారక్ అవరణలో డ్రోన్ ను పెట్రోలింగ్ సిబ్బంది గమనించారు. వెంటనే అధికారులకు సమాచారమిచ్చారు. ఆ డ్రోన్ ను పరిశీలించిన అధికారులు.. అది చైనాకు చెందినదిగా గుర్తించారు.ఆ డ్రోన్ రెండు లెన్స్ లు ఉన్నట్లు చెప్పారు. అయితే అది ఎక్కడి నుంచి వచ్చింది..? ఎవరికి చెందినదే దానిపై విచారణ చేపట్టారు. అయితే.. దేశంలోని అత్యంత ప్రమాదకరమైన జైలులో భోపాల్ సెంట్రల్ జైలు ఒకటి.