Breaking NewsHome Page SliderInternational

మాంస‌పు ముద్ద‌లుగా 179 మంది ప్రాణాలు

ద‌క్షిణ కొరియాలో జ‌రిగిన ఘోర విమాన ప్ర‌మాదంలో 179 మంది ప్రయాణీకులు.. మంట‌ల్లో చిక్కుకుని మాసపు ముద్ద‌లుగా మారి కాలిబూడిదైపోయారు.ధాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ నుంచి వ‌చ్చిన జెజూ ఎయిర్ సంస్థ‌కు చెందిన బోయింగ్ 737-800 విమానం మ‌యూన్ ఎయిర్ పోర్ట్‌లో ల్యాండ్ అవుతూ అదుపు త‌ప్పి విమానాశ్ర‌య ర‌క్ష‌ణ గోడ‌ను ఢీకొట్టింది.దీంతో విమానంలో ఒక్క‌సారిగా మాంట‌లు చెల‌రేగి పేలిపోయింది.విమానంలో 175 మంది ప్ర‌యాణీకులు,6గురు సిబ్బంది ఉండ‌గా ఇందులో ఇద్ద‌రు మినహా మిగిలిన 179 మంది మృతి చెందారు.దుర్మ‌ర‌ణం పాలైన వారిలో అత్య‌ధికులు ద‌క్షిణ కొరియా దేశ‌స్థులు కాగా ఇద్ద‌రు మాత్రం థాయ్ లాండ్ జాతీయులుగా గుర్తించారు.మంట‌ల్లో చిక్కుకుని ప్రాణాల‌తో ఉన్న ఇద్ద‌రిని అతి క‌ష్టం మీద సిబ్బంది ర‌క్షించారు.కాగా గేర్ వైఫ‌ల్యం కార‌ణంగా నే ఈ ప్ర‌మాదం చోటుచేసుకున్న‌ట్లు ప్రాధ‌మిక విచార‌ణ‌లో తేలింది.