టిక్‌టాక్‌పై ట్రంప్ కీలక నిర్ణయం..
అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించబోతున్న డొనాల్డ్ ట్రంప్ టిక్‌టాక్ యాప్‌పై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ యాప్‌పై నిషేధం వద్దంటూ ఆయన తరపు న్యాయవాదులు ఇప్పటికే సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనితో ఈ యాప్‌పై నిషేధం తొలగిపోతుందనే వార్తలు వస్తున్నాయి. ట్రంప్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు కూడా ఈ యాప్ నిషేధానికి ప్రయత్నించారు. కానీ అప్పట్లో న్యాయపరమైన చిక్కుల వల్ల ఈ నిషేధం ఆచరణలోకి రాలేదు. అనంతరం అధ్యక్షుడైన జో బైడెన్ ఈ యాప్ నిషేధంపై బిల్లు పెట్టగా అది ఆమోదం పొందింది. తర్వాత కాలంలో ట్రంప్ మళ్లీ టిక్ టాక్ వాడడం మొదలు పెట్టారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో కూడా దీనిపై నిషేధం ఎత్తేస్తామని ప్రకటించారు.