Home Page SlidermoviesNational

పుష్ప-2 మరో రికార్డ్

2024వ సంవత్సరం మరో మూడు రోజుల్లో చివరికొచ్చేస్తోంది. అయితే  ఈ సంవత్సరం అత్యధిక కలెక్షన్స్ సాధిస్తున్న చిత్రంగా పుష్ప-2 రికార్డు సాధించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప-2 కలెక్షన్లు సునామీని తలపిస్తున్నాయి. ఈ చిత్రం 22 రోజులలో రూ.1719.5 కోట్లు సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. న్యూఇయర్ వస్తుండడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. బాలీవుడ్‌లో కూడా అన్ని చిత్రాలనూ అధిగమిస్తూ రూ.700 కోట్లు పైగా సాధించింది.