Home Page SlidermoviesNational

బిగ్‌బాస్ షోలో సందడి చేసిన కీర్తి సురేశ్

కొత్త పెళ్లికూతురు కీర్తి సురేశ్ ఇటీవల హిందీ బిగ్‌బాస్ షోలో సందడి చేసింది. పెళ్లయిన రెండు రోజులకే తన కొత్త సినిమా బేబీ జాన్ మూవీ ప్రమోషన్స్‌కి హాజరయ్యింది. ఆమె బాలీవుడ్ ఎంట్రీ మూవీ ఈ బేబీ జాన్. హీరో వరుణ్ ధావన్‌తో కలిసి నటించిన చిత్రం ప్రమోషన్ల కోసం హిందీ బిగ్‌బాస్ షోలో పాల్గొంది. షో హోస్ట్ సల్మాన్ ఖాన్‌తో కలిసి స్టెప్స్ వేసింది. ఈ మూవీలో తన కోస్టార్స్ వరుణ్ ధావన్, వామికాగబ్బితో కలిసి బిగ్ బాస్ షోకి వచ్చింది. ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది.