Home Page SliderNationalSpiritual

అయోధ్య బాలరాముడి సరికొత్త రికార్డ్

అయోధ్య బాలరాముని ఆలయం ప్రతిష్ట రోజు కోట్ల మంది అయోధ్యను చేరుకున్న సంగతి తెలిసిందే. ఎన్నో సంవత్సరాల న్యాయపోరాటం తర్వాత ఆలయ నిర్మాణం, ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా జరిగాయి.  తాజాగా ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరం సరికొత్త పర్యాటక రికార్డును సృష్టించింది. ఇది దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పర్యాటక, అధ్యాత్మిక కేంద్రంగా అయోధ్య నిలిచింది. గతంలో ఆగ్రాలోని తాజ్ మహల్ స్థానాన్ని ఇప్పుడు అయోధ్య రామమందిరం భర్తీ చేసిందని చెప్పవచ్చు. భారత్‌లోనే మోస్ట్ పాపులర్ పర్యాటక కేంద్రంగా అయోధ్య మారింది. 2024 జనవరిలో ప్రతిష్ట జరిగిన కాలం నుండి సెప్టెంబర్ మధ్యకాలంలో 47.61 కోట్ల మంది పర్యాటకులు యూపీని సందర్శించారని ప్రభుత్వం ప్రకటించింది. దీనితో రాష్ట్ర పర్యాటక పరిశ్రమ అభివృద్ధి చెందుతోంది.