Home Page SliderTelangana

మూడు రోజుల పాటు భారీ వర్షాలు..

ఓ వైపు చలితో తెలుగు రాష్ట్రాలు గజ గజ వణికిపోతున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. వచ్చే 24 గంటలలో ఈ వాయుగుండం తీవ్రతను కొనసాగిస్తుందని వాతావరణశాఖ పేర్కొంది. ఏపీలోని పలు జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది. ఇక తెలంగాణలో డిసెంబర్ 24 నుంచి వానలు కురిసే అవకాశం ఉంది. అయితే డిసెంబర్ 24వ తేదీ నుంచి రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది.