జైలు నుండి వచ్చాక మీడియాతో అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు
శుక్రవారం జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో తన అరెస్టు, బెయిల్, విడుదలపై అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. బెయిల్ నిన్న సాయంత్రమే వచ్చినా రాత్రంతా జైలులో గడపడంపై ఆయన అభిప్రాయం కోసం మీడియా ప్రశ్నల వర్షం కురిపించింది. వీటికి జవాబులు చెప్తూ, తాను చట్టాన్ని గౌరవించే పౌరుడినని పేర్కొన్నారు. తప్పకుండా విచారణకు సహకరిస్తానన్నారు. తనకు ప్రేమతో, అభిమానంతో అండగా నిల్చినవారందరికీ కృతజ్ఞతలని పేర్కొన్నారు. తాను 20 ఏళ్లుగా ఇలా తన సినిమానే కాక, మామయ్య చిరంజీవి సినిమాలు కూడా ఫ్యాన్స్‌తో కలిసి, మొదటిరోజు చూస్తున్నానని, ఇలా ఎప్పుడూ జరగలేదన్నారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం అని, బాధిత కుటుంబానికి అండగా ఉంటానని పేర్కొన్నారు. విడుదలయ్యాక గీతా ఆర్ట్స్ ఆఫీసులో చాలాసేపు తన లాయర్లతో చర్చించారు. విడుదల ఆలస్యమవడంపై తీసుకోవల్సిన చర్యల గురించి ప్రస్తావించారని సమాచారం.