చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్..
అల్లు అర్జున్ వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. దీనితో నాంపల్లి కోర్టు విధించిన 14 రోజుల రిమాండ్ ఖరారయ్యింది. దీనితో చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ను తరలించే పనిలో పడ్డారు పోలీసులు. అనేక వాదోపవాదనల అనంతరం హైకోర్టులో హీరోకి ఊరట లభించలేదు. నాంపల్లి కోర్టు నుండి చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ను తరలించడానికి ట్రాఫిక్‌ను క్లియర్ చేసే పనిలో ఉన్నారు అధికారులు. ఈ నెల 27 వరకూ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. హైకోర్టులో మధ్యంతర బెయిల్ కూడా లభించలేదు.