ఘోర రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ సజీవ దహనం
ఔటర్ రింగ్ రోడ్డుపై నిన్న అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మియాపూర్ నుంచి బండ్లగూడకు ఓఆర్ఆర్ మీదుగా చెత్త లోడ్తో వెళ్తున్న లారీ మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌడ వెళ్లి గ్రామ పరిధిలోకి రాగానే అదుపుతప్పి రోడ్డు పైనుంచి కింద పడింది. దీంతో మంటలు చెలరేగి లారీ దగ్ధం అవగా అందులో ఉన్న డ్రైవర్ సందీప్ (27) సజీవ దహనం అయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

