Home Page Slidertelangana,

పట్నం నరేందర్ రెడ్డికి షాక్

మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి షాక్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. లగచర్ల ఘటనలో ఏ1గా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అయితే ఊరట ఏంటంటే ఈ కేసులో బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న ఆయన మెరిట్స్ పరిశీలించమంటూ కింది కోర్టుకు సూచించింది. కొడంగల్ కోర్టు తనకు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ ఆ కేసును క్వాష్ చేయాలని ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు.