పీకల్లోతు కష్టాల్లో భారత్..పరమ చెత్త రికార్డు
ఆస్ట్రేలియా, ఇండియా బోర్డర్ -గావస్కర్ ట్రోఫీలో భారత్ చెత్త రికార్డును మూటగట్టుకుంటోంది. పెర్త్‌లో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టాస్ నెగ్గి, బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ లంచ్ బ్రేక్ సమయానికి పీకల్లోతు కష్టాల్లో పడింది. టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 25 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి, కేవలం 51 రన్స్ మాత్రమే చేసింది. ఆస్ట్రేలియా గడ్డపై చెలరేగిపోతాడనుకున్న విరాట్ కోహ్లి 5 పరుగులకే ఖవాజాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. నిలకడగా ఆడుతున్నాడనుకున్న కేఎల్ రాహుల్ కూడా 26 పరుగుల వద్ద ఔట్ కావడంతో అభిమానులు నిరాశ చెందారు. ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్న రిషబ్ పంత్ 10 పరుగులు, ధ్రువ్ జురెల్ 4 పరుగుల వద్ద ఆడుతున్నారు.

