తెలంగాణాలో రెండు రోజుల పాటు వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణాలో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణశాఖ తెలిపింది. ఖమ్మం,కొత్తగూడెం,ములుగు,మహబూబాబాద్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆశాఖ అధికారులు తెలిపారు. వీటితో పాటు మరికొన్ని తెలంగాణా జిల్లాలకు కూడా వర్ష సూచన ప్రకటించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

