బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ భరోసా
ఎర్రవల్లి ఫాంహౌస్లో నేడు బీఆర్ఎస్ నేత కేసీఆర్ పలువురు పార్టీ నేతలను కలిసారు. వచ్చే ఎన్నికలలో తప్పకుండా అధికారంలోకి వచ్చేది తమ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. ఎవ్వరూ బెంగ పడవద్దని భరోసా ఇచ్చారు. కొత్త ప్రభుత్వం వచ్చి అప్పుడే సంవత్సరం కావస్తోందని, ప్రజలు ఇప్పటికే ప్రభుత్వంపై విసిగిపోయారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేతకాని హామీలనిచ్చి మభ్య పెట్టిందని, ఏమీ చెయ్యలేకపోయిందన్నారు. వాళ్లు ఏం కోల్పోయారో వారికి అర్థమయ్యిందన్నారు. మనపైనే విశ్వాసంతో ఉన్నారని పేర్కొన్నారు. పార్టీ నేతలెవ్వరూ అరెస్టులకు భయపడేది లేదన్నారు. అందరూ కష్టపడి పని చేయాలని అప్పుడే పార్టీ బలపడుతుందని పేర్కొన్నారు. నేడు పలువురు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా కేసీఆర్ వారితో మాట్లాడారు.