ఫలక్ నుమా ప్యాలెస్ లో సల్లూ భాయ్ షూటింగ్
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి హత్య బెదిరింపుల వస్తున్న నేపథ్యంలో భారీ భద్రత నడుమ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ షూటింగ్ కోసం హైదరాబాద్ లో అడుగు పెట్టాడు. తాజా సినిమా ‘సికందర్ ‘ షూటింగ్ కోసం ఫలక్ నుమా ప్యాలెస్ ను ఎంచుకున్నారు. ఈ మూవీకి సంబంధించి ప్యాలెస్ లో భారీ సెట్ వేసినట్టు సమాచారం. అయితే సికందర్ మూవీలో సల్మాన్ ఖాన్ కు జంటగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జోడీగా నటిస్తోంది. ఈ సినిమాను ఏఆర్ మురగదాస్ తెరకెక్కిస్తున్నారు. సాజిద్ నడియడ్ వాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

