సల్మాన్ ఖాన్‌కు బెదిరింపుల కేసులో మరో అరెస్టు
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను రూ.5 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. మొన్న శుక్రవారం మరోసారి సల్మాన్‌ను, ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీని డబ్బులివ్వకపోతే చంపుతామని సల్మాన్, జీషన్ ఆఫీసులకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. నోయిడాలోని గుఫ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేశారు. గతంలో మహ్మద్ తయ్యబ్‌ను, అనంతరం జంషెడ్ పూర్‌లోని షేక్ హుస్సేన్‌ను కూడా అరెస్టు చేశారు.