Home Page SliderNationalNews

‘మాకు క్లాప్స్ వద్దు..జస్టిస్ కావాలి’..శ్రేయాఘోషల్

కోల్‌కతాలో జరిగిన వైద్యురాలి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ అమానుష ఘటనపై టాప్ బాలీవుడ్ సింగర్ శ్రేయా ఘోషల్ గీతాన్ని ఆలపించారు. తాజాగా ఆమె ఆల్ హార్ట్స్ టూర్‌లో కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో కాన్సర్ట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అత్యాచార గాయపడిన నా శరీరం బాధను తెలియజేస్తున్నాను. ఈ పాటను ఉద్వేగభరితంగా ఆలపిస్తూ ఎవ్వరూ చప్పట్లు కొట్టొద్దని ఆడియన్స్‌ను కోరారు. కేవలం న్యాయం జరిగితే చాలన్నారు. ఆమె పాట పూర్తయ్యాక వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలతో స్టేడియం హోరెత్తింది. ఆమె గీతాన్ని పలువురు ప్రదర్శించారు. గతంలో ఈ కాన్సర్ట్‌ను ఈ సంఘటన వల్ల ఆమె వాయిదా వేసుకున్నారు.