యాదాద్రిలో బీఆర్‌ఎస్ నేత రీల్స్..నెటిజన్ల మండిపాటు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాదంలో ఇరుక్కున్నారు. పవిత్రమైన యాదాద్రి ఆలయ మాడవీధులలో భార్య, కుమార్తెతో కలిసి కౌశిక్ రెడ్డి రీల్స్ చేశారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సెల్‌ఫోన్స్, కెమెరాలు నిషేదం ఉండగా కౌశిక్ రెడ్డి రీల్స్ చేయడం వివాదాస్పదమయ్యింది. ఈ ఘటనపై నెటిజన్లు, భక్తులు మండిపడుతున్నారు. ఇటీవల సొంత పార్టీకే చెందిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో గొడవలు పడి, రోడ్డుకెక్కి రచ్చ చేసుకున్న విషయం తెలిసిందే.