మునావర్ ను మేం వదిలిపెట్టం..
సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ దేవాలయం కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ అసలు నిందితుడు మునావర్ జామా పేరును పేర్కొన్నప్పటికీ అతడిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. అతడిని మీరు వదిలిపెట్టినా.. మేం వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ.. మునావర్ ముంబైలో ఉంటాడని, దేశంలో రెండో జాకీర్ నాయక్ కావాలనేది అతడి ఆశయమని, దాదాపు 100 నుంచి 150 మందిని మెట్రో పోలీస్ హోటల్లో పెట్టుకుని హిందూ ధర్మం, దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. అతడి మాటలు విని చాలామంది టెర్రరిస్టులుగా మారారని, ఈ కేసును ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. హిందూ దేవాలయాలపై దాడులు చేస్తే నిర్లక్ష్యం వహించొద్దని సీఎం రేవంత్, డీజీపీలను రాజాసింగ్ కోరారు.