పోస్టు ద్వారా రూ.21కోట్ల డ్రగ్స్ దిగుమతి
పోస్టాఫీసులో రూ.21 కోట్ల విలువగల డ్రగ్స్ దిగుమతి కావడంతో పోలీసులు నివ్వెరపోయారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. బెంగళూరులోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నగరంలోని ఫారిన్ పోస్టు ఆఫీసు వద్ద తనిఖీలలో రూ.21 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీలో 606 డ్రగ్స్ పార్శిళ్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు అధికారులు. ఈ పార్సిళ్లలో హైడ్రో గంజాయి, ఎల్ఎస్డీ, ఎండీఎంఏ క్రిస్టల్స్ వంటి మత్తు పదార్థాలున్నాయని తెలిపారు. ఇవి అమెరికా, బెల్జియం, యూకె, థాయ్లాండ్, నెదర్లాండ్స్ వంటి దేశాల నుండి అక్రమంగా రవాణా చేస్తున్నారు. వీటిని బెంగళూరులో విక్రయించే ఉద్దేశంతో ఇండియన్ పోస్టు ద్వారా దిగుమతి చేసుకుంటున్నట్లు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు.