Andhra PradeshHome Page Slider

ఎట్టకేలకు ఏపీకి ఐఏఎస్‌లు

తెలంగాణ నుండి ఏపీకి వెళ్లాల్సిన ఐఏఎస్‌లు ఎట్టకేలకు ఏపీలో రిపోర్టు అయ్యారు. ఆమ్రపాలి, వాకాటి కరుణ, రోనాల్డ్ రోస్, వాణీ ప్రసాద్‌లు హైకోర్టు కూడా వీరి పిటిషన్‌ను అంగీకరించక పోవడంతో వారు ఏపీకి రిపోర్టు చేయవలసి వచ్చింది. తెలంగాణలోనే కొనసాగాలని వారు చేసిన ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టాయి. క్యాట్, హైకోర్టు కూడా వారికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడంతో వారు ఏపీ సీఎస్ నీరభ్‌ కుమార్‌కు రిపోర్టు చేశారు. అలాగే ఏపీ నుండి రిలీవ్ అయిన ఐఏఎస్‌లు సృజన, శివశంకర్, హరికిరణ్‌లు కూడా తెలంగాణలో రిపోర్టు అయ్యారు. రేపు వీరందరికీ శాఖలు కేటాయించే అవకాశముంది.