మొసళ్లను తీసుకెళ్తున్న వాహనం బోల్తా.. స్థానికుల టెన్షన్
వన్యప్రాణులను తీసుకెళ్లుతున్న వాహనం బోల్తా పడి, అవి బయటకు రావడంతో స్థానికులు టెన్షన్ చెందిన ఘటన బుధవారం జరిగింది. బిహార్ రాజధాని పట్నాలోని సంజయ్‌గాంధీ జాతీయ జూపార్కు నుండి వన్యప్రాణులను తరలిస్తున్నారు. ఈ క్రమంలో మొసళ్లు, పులులతో కూడిన బెంగళూరులోని రెండు వాహనాలను బన్నేరుగట్ట జాతీయపార్కుకు తీసుకువెళ్తుండగా, ఒక వాహనం నిర్మల్ జిల్లా మామడ మండలం మొండిగుట్ట గ్రామం వద్ద బోల్తా పడింది. దీనిలో ఘరియాల్ జాతికి చెందిన 8 మొసళ్లు ఉన్నాయి. అరుదైన ఒక తెల్ల పులి కూడా ఉంది. ఈ మొసళ్లలో రెండు బయటకు తప్పించుకోగా, స్థానికులు టెన్షన్‌కు గురయ్యారు. అయితే స్థానిక అటవీ అధికారుల రక్షణ చర్యలతో వాటిని పట్టుకుని మరో వాహనంలో వాటిని తరలించారు. దీనితో వారు ఊపిరి పీల్చుకున్నారు.