Home Page SliderNational

నాడు జ్యూస్ అమ్మేవాడు.. ఇప్పుడు బెట్టింగ్ సామ్రాజ్యాధిపతి

మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రధాన ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్ చంద్రకర్‌ను ఇండియా రప్పించేందుకు అధికారులు సిద్ధమవుతున్నప్పటికీ, డబ్బు ఎలా తరలించబడింది, యాప్ ఆపరేషన్‌లో ఎంతవరకు సంబంధం ఉందన్న దానిపై పూర్తి స్థాయిలో పరిశోధన జరుగుతోంది. మనీలాండరింగ్, మోసం కేసులో ఇంటర్‌పోల్ జారీ చేసిన అరెస్ట్ వారెంట్ ఆధారంగా దుబాయ్‌లో చంద్రకర్‌ని అధికారికంగా అరెస్టు చేశారు. రెడ్ నోటీసు (RN) జారీ చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేసిన అభ్యర్థన మేరకు చంద్రకర్‌తో పాటు యాప్ మరొక ప్రమోటర్ రవి ఉప్పల్‌ను గత ఏడాది చివర్లో దుబాయ్‌లో అదుపులోకి తీసుకుని “హౌస్ అరెస్ట్” చేశారు. చంద్రకర్, సహ-ప్రమోటర్ రవిల్ ఉప్పల్ ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌కు చెందినవారు. కానీ మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ను దుబాయ్ నుండి ఆపరేట్ చేశారు. స్వగ్రామంలో ఉన్నప్పుడు సౌరభ్ చంద్రకర్ జ్యూస్ దుకాణం నడిపాడు. 2019లో దుబాయ్‌ వెళ్లాడు.

యాప్‌ను ప్రారంభించిన తర్వాత, మలేషియా, థాయ్‌లాండ్, యుఎఇ, ఇండియాలోని ప్రధాన నగరాల్లో కాల్ సెంటర్‌లను తెరిచి, ఆన్‌లైన్ బెట్టింగ్‌ ఈజీగా చేయడాన్ని వృత్తిగా మార్చుకున్నారు. ఛత్తీస్‌గఢ్, భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో, చంద్రకర్, ఉప్పల్‌ల సన్నిహిత సహాయకులు సునీల్ దమానీ, అనిల్ దమానీ 30 కాల్ సెంటర్‌లు ద్వారా డీల్స్ చేశారు. ఇండియాలో పలు రాష్ట్రాలలో దాదాపు 4,000 మంది ‘ప్యానెల్ ఆపరేటర్లు’ ఉన్నారని, దాదాపు 200 మంది కస్టమర్‌లు బెట్టింగ్‌లను నిర్వహిస్తున్నారని ED పేర్కొంది. ఈ పద్ధతిని ఉపయోగించి, ఇద్దరూ రోజుకు కనీసం ₹ 200 కోట్లు సంపాదించడమే కాకుండా UAEలో నేర సామ్రాజ్యాన్ని నిర్మించారని ఈడీ తేల్చింది. బెట్టింగ్‌లు, ఇతర ఇంటర్‌లింక్డ్ యాప్‌ల ద్వారా వేల కోట్లు స్వాహా చేసినట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించారు. చంద్రకర్, ఉప్పల్ ఇద్దరూ సమాజాన్ని ప్రభావితం చేసే పోలీసులు, బ్యూరోక్రాట్‌లు, రాజకీయ నాయకులతో కలిసి యాప్‌ను గ్రౌండ్ లెవల్లోకి తీసుకెళ్లగలిగారు. దమానీల సాయంతో పెద్ద సంఖ్యలో బినామీ బ్యాంకు ఖాతాలు తెరిచారు. హవాలా ద్వారా సంపాదించిన డబ్బును పోలీసులు, రాజకీయ నాయకులు బ్యూరోక్రాట్‌లకు స్కానర్ కిందకు రాకుండా చెల్లింపు బాధ్యతను అనిల్ దమానీకి అప్పగించారు. ఛత్తీస్‌గఢ్ పోలీస్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ చంద్ర భూషణ్ వర్మకు కూడా డబ్బు పంపారు.

అప్పటి ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ రాజకీయ సలహాదారు వినోద్ వర్మతో ప్రత్యక్ష సంబంధంలో ఉన్నాడు. పోలీసులు, అధికారులు, రాజకీయ నాయకులతో కలిసి సిండికేట్‌ను నిర్వహించాడు. యుఎఇలోని ప్రమోటర్లకు హవాలా ద్వారా దమానీలు పెద్ద మొత్తంలో నగదును కూడా పంపారు. గత 2-3 సంవత్సరాలలో, సునీల్ దమానీ, ఉప్పల్ అభ్యర్థన మేరకు హవాలా ద్వారా ₹ 60-65 కోట్ల లావాదేవీలు నిర్వహించారని, అయితే తనకు ₹ 6 లక్షలు ఇచ్చారని అనిల్ దమానీ విచారణలో తెలిపారు. జ్యువెలరీ షాపు ద్వారా హవాలా రింగ్‌ను నడుపుతున్నట్లు ఆయన తెలిపారు. దమానీలు చంద్రకర్ మరియు ఉప్పల్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు కాల్ డిటైల్ రికార్డ్‌ల్లో తేలింది. ఈ కేసులో ఈడీ అరెస్టు చేసిన సతీష్ చంద్రకర్ నాలుగు కాల్ సెంటర్లను నడుపుతున్నాడు. ఐదు శాతం వాటాను కలిగి ఉన్నాడు. అక్రమ నగదు లావాదేవీలను పర్యవేక్షించే బాధ్యతను కూడా ఆయనకు అప్పగించారు. ఈ కేసులో పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్, డ్రగ్స్ మాఫియా బాస్ తపన్ సర్కార్‌తో సతీష్ చంద్రకర్‌కు కూడా సంబంధాలున్నట్లు విచారణలో తేలింది. ED ప్రకారం, ఈ కేసులో నేరం అంచనా ఆదాయం సుమారు ₹ 6,000 కోట్లు.

బాలీవుడ్ కనెక్షన్
ఫిబ్రవరి 2023లో యుఎఇకి చెందిన రస్ అల్ ఖైమాలో చంద్రకర్ వివాహం జరిగిందని, ఈ ఈవెంట్ కోసం దాదాపు ₹ 200 కోట్ల “నగదు” ఖర్చు చేశారని ED తన ఛార్జ్ షీట్‌లో ఆరోపించింది. దాదాపు 17 మంది హిందీ సినీ ప్రముఖులు, చంద్రకర్ బంధువులు చార్టర్డ్ ఫ్లైట్‌లో అక్కడికి చేరుకున్నారు. సెలబ్రిటీలు కూడా వివాహ వేడుకలో పాల్గొనగా, ప్రతిఫలంగా హవాలా ద్వారా కోటి రూపాయలు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇంకా, నటుడు రణబీర్ కపూర్ మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌తో లింక్ చేయబడిన స్పోర్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అందుకే వివాహానికి హాజరైన నటీనటులందరినీ విచారణ పరిధిలోకి చేర్చారు.