హర్యానా, రోహతక్‌లో 2 ఓట్లతో గెలుపు, ఖరారు చేయని ఈసీ
హర్యానాలో అనూహ్య ఫలితాలొస్తున్నాయ్. కాంగ్రెస్ పార్టీ సునాయశంగా గెలుస్తోందని సర్వే సంస్థలన్నీ ప్రకటించినప్పటికీ అనూహ్యంగా అక్కడ బీజేపీ విజయం సాధించింది. అయితే రోహతక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 2 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 15 రౌండ్లుండగా మరో రౌండ్ ఓట్లను వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి భరత్ భూషణ్ బాత్రా 53,822 ఓట్లు పొందగా, బీజేపీ అభ్యర్థి మనీష్ కుమార్ గ్రోవర్ 53,820 ఓట్ల సాధించారు. ఇక ఆమ్ ఆద్మీతో సహా స్వతంత్రులు ఎవరూ కూడా వెయ్యి ఓట్లు పొందలేదు. తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థి భరత్ భూషణ్ బీజేపీ అభ్యర్థిపై 1341 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందాడు.