జగన్ వస్తాడేమో అని ప్రభుత్వం పని చేసింది..పెద్దిరెడ్డి
పుంగనూరులో ఏడేళ్ల చిన్నారి అశ్వియ అంజూమ్ కిడ్నాప్, హత్య ఘటనపై ప్రభుత్వం వేగంగానే స్పందించిందని కితాబిచ్చారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మాజీ సీఎం జగన్ పుంగనూరు పర్యటన సంగతి తెలిసి, రాష్ట్రప్రభుత్వం హుటాహుటిన ముగ్గురు మంత్రులను పంపి, నిందితులు అరెస్టయ్యేలా చూసిందని హర్షం వ్యక్తం చేశారు. కర్నూలులో జరిగిన ఘటన విషయంలో కూడా ఇలా స్పందిస్తే బాగుండేదన్నారు. దీనితో జగన్ పర్యటనను రద్దు చేసుకున్నారని ఆయన మీడియాకు తెలిపారు.