నమ్మకం ఉందంటున్నా, తేడాగా బాడీ లాంగ్వేజ్
హర్యానాలో సీన్ మారుతోండటంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బూపేందర్ సింగ్ హుడా ఆశ్యర్యానికి గురయ్యారు. తొలుత పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నప్పటికీ, తర్వాత బీజేపీ వైపు ఫలితాలు కన్పిస్తోండటంతో ఆయన నిరాశకు గురైనట్టుగా కన్పించారు. బీజేపీ 48 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నప్పుడు అంటే, ఉదయం 11 గంటల ప్రాంతంలో విలేకరులతో మాట్లాడుతూ – సగం కంటే మూడు స్థానాల్లో – కాంగ్రెస్‌కు సొంతంగా మెజారిటీ వస్తుందని హుడా చెప్పారు. ఐతే ఫలితం మారుతుందంటూ విలేకరులు ప్రశ్నించగా, కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పినప్పటికీ ఆయన బాడీ లాంగ్వేజ్ మాత్రం తేడాగా కన్పించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని.. కేవలం రెండు, మూడు రౌండ్ల కౌంటింగ్ పూర్తయిందని.. కాంగ్రెస్‌కు మెజారిటీ వస్తుందని వస్తుందని ఆయన అన్నారు.

