Home Page SliderNational

నకిలీ SBI బ్రాంచ్, నిరుద్యోగుల నుంచి లక్షల వసూళ్లు

మోసగాళ్లకే మోసగాళ్లను చూస్తున్నాం. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించడం ఇవాళా, రేపు సర్వసాధారణమైపోయింది. చీటింగ్ చేసేందుకు కాదేదీ అనర్హం అన్నట్టుగా ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో మోసగాళ్లు ఉద్యోగాల పేరుతో లక్షలు దండుకున్నారు. ఉద్యోగాల నియామకాలు, ఫేక్ ట్రైనింగ్ అంటూ నిరుద్యోగులను చీట్ చేశారు. రాజధాని రాయపూర్‌కు 250 కిలో మీటర్ల దూరంలో శక్తి జిల్లాలోని చపోరాలో ఆరుగురు ఈ స్కామ్‌కు పాల్పడ్డారు. బ్యాంక్ ప్రారంభించినప్పుడు ఎలా ఉంటుందో డిట్టో అలా ఏర్పాటు చేసి వంచించారు. మేనేజర్, క్యాషియర్, క్లర్క్ ఇలా పలు ఉద్యోగాలకు 2 లక్షల నుంచి 6 లక్షల రేటు పెట్టి మరీ వసూలు చేశారు.