సుప్రీం కోర్టులో ఈషా ఫౌండేషన్ నిర్వాహకుడు సద్గురుకు ఊరట
ఆధ్యాత్మిక గురువు సద్గురుకు పెద్ద ఊరట లభించింది. ఇషా ఫౌండేషన్‌పై దాఖలైన కేసులను దర్యాప్తు చేయాలని తమిళనాడు పోలీసులను, మద్రాస్ హైకోర్టు ఆదేశించగా, సుప్రీంకోర్టు ఇవాళ నిలిపేసింది. కేసు విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. కోయంబత్తూర్‌లోని వందలాది మంది పోలీసులు మంగళవారం తన ప్రాంగణంలోకి ప్రవేశించిన తర్వాత హైకోర్టు ఆదేశాలపై ఇషా ఫౌండేషన్ సవాలును భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్‌లో తన కుమార్తెలు గీత, లత నివాసం ఉండేందుకు బ్రెయిన్‌వాష్ చేశారని ఆరోపిస్తూ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్ కామరాజ్ పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు విచారణకు ఆదేశించింది. తమ కుటుంబంతో సంబంధాలు కొనసాగించేందుకు ఫౌండేషన్ అనుమతించడం లేదని ఆరోపించారు. ఐతే ఇషా ఫౌండేషన్ ఆరోపణలను ఖండించింది.

