Home Page SliderNational

చీపురు పట్టిన ప్రధాని

స్వచ్ఛతా హి సేవా కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. స్వచ్ఛ భారత్ మిషన్ కి నేటితో 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. గాంధీ జయంతి సందర్భంగా చిన్నారులతో కలిసి విజ్ఞాన్ భవన్ లో స్వచ్ఛతా హి సేవా 2024 కార్యక్రమంలో పాల్గొన్నారు. చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. ప్రధాని మోదీ వెంట చిన్నారులు కూడా పరిసరాలను క్లీన్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రజలంతా పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. ప్రజల చొరవతోనే ‘క్లీన్ ఇండియా’ స్ఫూర్తి మరింత బలోపేతం అవుతుందని ఆకాంక్షించారు.