మంత్రి ఇంట్లో ఈడీ దాడులు
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేపట్టడం సంచలనంగా మారింది. నేటి ఉదయం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో తనిఖీలు మొదలుపెట్టారు. అంతేకాక ఆయన కుమార్తె, బంధువుల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగడం విశేషం. హిమయత్‌సాగర్‌లో ఆయనకు చెందిన ఫాంహౌస్‌లో కూడా ఏకకాలంలో అన్ని ప్రదేశాలలో సోదాలు నిర్వహిస్తున్నారు. దీనితో కాంగ్రెస్ పార్టీ నేతలు ఉలిక్కిపడుతున్నారు. గత ఏడాది నవంబర్‌లో కూడా ఆయన ఇంట్లో ఈడీ దాడులు జరిగాయి. అయితే ఇప్పుడు ఢిల్లీ నుండి వచ్చిన 16 ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. సీఆర్‌పీఎఫ్ బలగాలు కూడా ఉన్నట్లు సమాచారం.