Home Page SliderNational

రక్తదానం చేసినట్లు నటించిన బీజేపీ మేయర్ ..

రక్త దాన శిబిరంలో బెడ్ పై పడుకుని బీజేపీ మేయర్ ఫోటోలకు ఫోజులిస్తూ రక్తదానం చేశారు. మేయర్ రక్తదానం చేశారని అందరూ అనుకున్నారు. అందులో విశేషమేముందని అనుకుంటున్నారా? అసలు ఆయన రక్త దానం చేస్తున్నట్లు నటించారు తప్ప నిజంగా రక్తదానం చేయలేదన్నమాట. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని మొరాదాబాద్ లో జరిగింది. రక్తం తీసుకునేందుకు వైద్య సిబ్బంది ప్రయత్నించగా.. రక్తం దానం చేసినట్లు నటించి ఫోటోలు ఫోజులిస్తూ.. వెంటనే బెడ్ పై నుంచి లేచి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ మేయర్ పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా స్థానిక బీజేపీ కార్యాలయంలో రక్త దాన శిబిరం నిర్వహించారు. బీజేపీ సీనియర్ నేత, మొరాదాబాద్ మేయర్ వినోద్ అగర్వాల్ అక్కడికి వచ్చారు. ఒక బెడ్ పై పడుకున్న ఆయన రక్తదానం చేస్తున్నట్లు నటించి.. ఫోటోలకు ఫోజులిచ్చారు. బీపీ పరీక్షించేందుకు డాక్టర్ సిద్ధం కాగా ఇది అవసరం లేదని చెప్పి వెంటనే అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ వీడియో పై విమర్శలు రావడంతో ఆయన ఇలా స్పందించారు. తన పరువు తీసేందుకు ప్రత్యర్థులు కుట్ర పన్నారని ఆరోపించారు. రక్తం తీసుకునే ముందు నాకేదైనా జబ్బు ఉందా? అని డాక్టర్ అడిగారు. షుగర్ ఉందని, రెండేళ్ల క్రితం గుండె సమస్య ఉన్నదని చెప్పాను. నేను రక్త దానం చేయకూడదని డాక్టర్ అన్నారు. దీంతో వెంటనే పైకి లేచా నని మేయర్ పేర్కొన్నారు.