ధోనీ రికార్డు బద్దలు కొట్టిన యువ క్రికెటర్
భారత్ తరపున అత్యుత్తమ వికెట్ కీపర్‌గా ధోనీకి మంచి పేరుంది. వికెట్ కీపర్లలో అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డు 144 ఇన్నింగ్సులో 6 సెంచరీలతో ధోనీ పేరిట ఉండగా, ఇప్పుడు దానిని భారత యువ కెరటం రిషబ్ పంత్ బద్దలు కొట్టాడు. అయితే పంత్ మరో అడుగు ముందుకేసి కేవలం 58 ఇన్నింగ్స్‌లోనే 6 సెంచరీలు పూర్తి చేయడం విశేషం. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో భారత వీరులు విజృంభిస్తున్నారు. బ్యాటర్లు రిషబ్ పంత్ 128 బంతులలో 109 రన్స్ చేయగా, శుభ్‌మన్ గిల్ 176 బంతులలో 119 రన్స్ చేశాడు. కేఎల్ రాహుల్ కూడా దూకుడుగా ఆడడంతో బంగ్లాదేశ్ ముందు 515 పరుగుల టార్గెట్‌ను నిలిపింది టీమిండియా.

