Home Page SliderNational

వందేభారత్ రైలు జెండా ఊపుతూ పట్టాలపై పడిపోయిన బీజేపీ ఎమ్మెల్యే

సోమవారం ఇక్కడ ఆగ్రా-వారణాసి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు పచ్చజెండా ఊపేందుకు పోటీపడ్డారు బీజేపీ ఇటావా ఎమ్మెల్యే సరితా బహదౌరియా. అనుకోకుండా ఆమె రైలు పట్టాలపై పడిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సాయంత్రం 6 గంటల సమయంలో రద్దీగా ఉండే ప్లాట్‌ఫార్మ్‌పై ఈ ఘటన జరిగింది. 61 ఏళ్ల రెండోసారి ఎమ్మెల్యే, రైలుకు ఆకుపచ్చ జెండా ఊపిన వ్యక్తుల్లో ఉన్నారు. వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించిన తర్వాత, 20175 నంబర్ గల రైలు, ఆగ్రా నుండి రైల్వే మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు ప్రారంభించారు. అయితే ఎమ్మెల్యే ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని, పెద్దగా ఆందోళన చెందాల్సిన అసరం లేదని బీజేపీ ఇటావా యూనిట్ కోశాధికారి సంజీవ్ భదౌరియా చెప్పారు.

ఎటావా స్టేషన్‌కు చేరుకోవడానికి ముందు రైలు తుండ్లాలో ఆగింది. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జితేంద్ర దౌవారే, బీజేపీ మాజీ ఎంపీ రామ్ శంకర్, ప్రస్తుత ఎమ్మెల్యే సరితా బదౌరియాతో సహా వివిధ రాజకీయ ప్రముఖులు రైలు ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు తరలివచ్చారు. రైలు బయల్దేరుతున్నట్లు హారన్ మోగించడంతో, ప్లాట్‌ఫామ్ పై గందరగోళం నెలకొంది. కొట్లాటలో, ఎమ్మెల్యే ప్లాట్‌ఫార్మ్‌ నుండి కిందపడిపోయారు. ఆమె రైలు ముందు ఉన్న రైలు పట్టాలపై పడిపోయారు. పక్కనే ఉన్నవారు రైలును సకాలంలో ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, భదౌరియాను పోలీసులు ట్రాక్స్ నుండి త్వరగా రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఈ రైలు ఆగ్రా-వారణాసి మధ్య దూరాన్ని దాదాపు ఏడు గంటల్లో కవర్ చేస్తుంది. తిరుగు రైలు వారణాసి నుండి ఆగ్రాకు 20176 నంబర్‌గా నడుస్తుంది. ఆగ్రా-వారణాసి సర్వీస్ నంబర్ 20175గా ఉంటుంది.