NationalTrending Today

‘ఫ్రెండ్స్‌తో వెళ్లొచ్చు’… వైరల్‌గా పెళ్లికూతురి అగ్రిమెంట్

పెళ్లి తర్వాత భర్తకు స్వేచ్ఛనిస్తానని పెళ్లికుమార్తె అగ్రిమెంట్‌పై సంతకం చేసిన ఒక సంఘటన వైరల్ అవుతోంది. తమిళనాడులోని తెన్‌పాడికి చెందిన ముత్తుకుమార్‌కు కురింజిపాడికి చెందిన పవిత్రతో సోమవారం వివాహం జరిగింది. వరుడు ముత్తుకుమార్ స్నేహితులు ఈ సందర్భంలో వధువు పవిత్రతో విచిత్రమైన అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. వివాహం తర్వాత ఆమె ముత్తుకుమార్‌ను తమతో ఎక్కువగా కలవనివ్వదేమో, టూర్స్‌కు వెళ్లడానికి అంగీకరించదేమో అని భయపడ్డారు. దీనితో ఒక ప్లాన్ ప్రకారం రూ.100 స్టాంప్ పేపర్‌పై పెళ్లినాడే ఆమెతో అగ్రిమెంట్ రాయించుకున్నారు. పెళ్లి తర్వాత కూడా అతడిని స్నేహితులతో విహారయాత్రలకు అంగీకరిస్తానని, ఆనందంగా గడపడానికి అనుమతిస్తానని రాయించుకున్నారు. ఆమె సంతోషంగానే దానిపై సంతకం పెట్టింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.