రాహుల్ గాంధీపై శివసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్రలోని షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లకు ముగింపు పలకాలన్న రాహుల్ గాంధఈ నాలుకను కోసేయాలని వివాదాస్పదంగా మాట్లాడారు. అలా కోసి, నాలుకను తెచ్చినవారికి రూ.11 లక్షలు ప్రైజ్ మనీ కూడా ఇస్తానని ప్రకటించారు. ఒకవైపు రిజర్వేషన్లపై ఇంకా పెంచాలని చర్చలు జరుగుతుంటే రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అవమానమన్నారు. ఈ మాటలను బట్టి ఆయన నిజస్వరూపం ఏంటో తెలిసిందన్నారు. ఈ వ్యాఖ్యలపై మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో సంబంధం లేనట్లు వ్యవహరించింది.