‘జోర్దార్’గా జరిగిన జోర్దార్ సుజాత సీమంతం
న్యూస్ యాంకర్‌గా జోర్దార్ సుజాత తెలుగు రాష్ట్ర ప్రజలకు సుపరిచితమే. మొదటగా ఆమె ఒక న్యూస్ ఛానల్లో తెలంగాణ యాసలో యాంకర్‌గా పని చేసింది. ఆ సమయంలో ఆమె బాగా ఫేమస్ అయిపోయింది. ఆ తరువాత రియాల్టీ షో అయిన తెలుగు బిగ్‌బాస్‌లో పాల్గొంది. దాని తరువాత జబర్దస్త్ కామెడీ షోలో చేసింది. ఆ సమయంలోనే కమెడియన్ అయిన రాకింగ్ రాకేష్‌ని ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. పెళ్ళి తరువాత కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ చేసి తన నటనతో ఆకట్టుకున్నది. తన యాక్టింగ్‌కి మంచి మార్కులే పడ్డాయి అని చెప్పొచ్చు. తాజాగా ఆమె సీమంతం ఫోటోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. బంధుమిత్ర సమక్షంలో ఘనంగా సుజాత సీమంతం జరిగింది. వాటిని రాకింగ్ రాకేష్ తన సోషల్ అకౌంట్లో పంచుకున్నారు. నెటిజన్లు దంపతులిద్దరికి విషెస్ తెలియజేస్తున్నారు.