Home Page SliderNational

సూసైడ్ చేసుకున్న స్టార్ హీరోయిన్ తండ్రి…..

బాలీవుడ్ నటి మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె తెలుగులో పవణ్ కళ్యాణ్ నటించిన గబ్బర్‌సింగ్ సినిమాలో కెవ్వు కేక అనే ఐటమ్ సాంగ్ చేసారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తమ్ముడైన అర్బాజ్ ఖాన్ ఈమె మాజీ భర్త. మలైకా తండ్రి అనిల్ అరోరా (65) నిన్న ఉదయం ముంబైలోని బాంద్రాలో తన అపార్ట్‌మెంట్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. మలైకా తల్లిదండ్రులు ఆమె 11 సంవత్సరాల వయస్సులోనే విడాకులు తీసుకున్నారు. ఆమెకు ఒక సోదరి. ఆమె తండ్రి అనిల్ అరోరా భారతీయ మర్చంట్ నేవీలో పనిచేశారు.