కూతురి తలపై సీసీ కెమెరా పెట్టిన తండ్రి, కారణం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
కూతురి తలపై సీసీ కెమెరా పెట్టిన తండ్రి. ఇలా కూడా చేస్తారా అని అందరూ అనుకోవచ్చు. కాని ఆ అందరితో నాకు అవసరం లేదు నాకు నా కూతురి భద్రత మాత్రమే ముఖ్యం అంటున్నాడా తండ్రి. వివరాల్లోకి వెళ్తే పాకిస్థాన్‌కి చెందిన ఓ వ్యక్తి తన కూతురి భద్రత కోసం వినూత్నంగా ఆలోచించాడు. ఇటీవల కరాచీలో జరిగిన హింసాత్మకమైన ఘటన తర్వాత తన కూతురి భద్రత కోసం ఒక సీసీ కెమెరాను తన కూతురి తలపై పెట్టాడు. దాంతో తన కూతురికి ఎటువంటి ఆపద వచ్చినా కాపాడుకోవచ్చని ఆ తండ్రి ఆరాటం. దానికి సంబందించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఆ యువతి మాట్లాడుతూ “మా నాన్న నా తలపై దీనిని నా భద్రత కోసం ఇంస్టాల్ చేసారు. చూసే వారికి ఇది వింతగా అనిపించవచ్చు, కాని నాకు ఆయన ప్రేమ మాత్రమే కనిపిస్తుంది. దీనివల్ల నాకు ఇబ్బంది ఏమీ లేదు. ఆయన నా సెక్యూరిటీ గార్డ్” అని చెప్పుకొచ్చింది.