2.5 కోట్లు గెలిచిన సాధారణ వ్యక్తి
రూ.500 తో 2.5 కోట్లు ఒక సాధారణ వ్యక్తి గెలిచాడు. ఈ సంఘటన పంజాబ్‌లో జరిగింది. చాలా మంది లాటరీ టిక్కెట్టు కొంటే ఒకేసారి ఎక్కువమొత్తంలో డబ్బు వస్తుంది అనే ఆశ తోటి లాటరీలు కొంటుంటారు. కాని అది కొంటే సరిపోదు. దానితోపాటు కొంచం అదృష్టం కూడా ఉండాలి. ఆ అదృష్టం ఈ వ్యక్తికి 50 ఏళ్ళకి తలుపు తట్టింది.
పంజాబ్‌లోని జలంధర్‌కి చెందిన ప్రీతమ్ లాల్ పాత సామాన్లు కొనుగోలు చేస్తుంటారు. గత 50 ఏళ్ళుగా లాటరీ టిక్కెట్స్ కొంటున్నారు. కాని ప్రతీసారి ఆయనకు నిరాశే ఎదురయ్యేది. భార్య సలహా మేరకు చివరిగా రూ.500 పెట్టి ఒక లాటరీ టిక్కెట్టు కొన్నారు. అయితే ఈ సారి మాత్రం ఆయనకి అదృష్టం వరించి 2.5 కోట్లు గెలిచేలా చేసింది. పంజాబ్ స్టేట్ లాటరీలో ఆయన 2.5 కోట్లు గెలిచారు.

