బీజేపీ సైబర్ నేరాలకు పాల్పడుతోంది..మమత సంచలన ఆరోపణలు
బీజేపీ పార్టీపై తీవ్ర సంచలన ఆరోపణలు చేశారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఏఐ సహాయంతో భారీ స్థాయిలో సైబర్ నేరాలకు బీజేపీ పాల్పడుతోందని విమర్శించింది. అవాస్తవాలు ప్రచారాలకు ఏఐని వాడుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రప్రభుత్వానికి నిజమైన అధికారాలు ఉండుంటే ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసు నిందితునికి కేవలం ఏడు రోజులలో మరణశిక్ష విధించేవాళ్లమన్నారు. అతడికి శిక్ష పడేదాకా తమ ఉద్యమం ఆగదన్నారు. సీబీఐ ఇంతకాలం ఏం చేస్తోందని ఎద్దేవా చేశారు. జూనియర్ వైద్యులపై ఉద్యమం కారణంగా ఎలాంటి కేసులు పెట్టమని హామీ ఇచ్చారు.