Home Page SliderTelangana

ఎవరైనా అడ్డొస్తే బుల్‌డోజర్లు ఎక్కించాల్సిందే..

ప్రస్తుతం తెలంగాణలో ప్రతి ఒక్కరూ హైడ్రా గురించి చర్చించుకుంటున్నారు. ఒకవైపు అక్రమ నిర్మాణాలు చేసిన వారి గుండెల్లో హైడ్రా దడ పుట్టిస్తోంది. మరోవైపు అధికార పార్టీ కాంగ్రెస్ నేతలతో పాటు వివిధ పార్టీల నేతలు కూడా హైడ్రాకు మద్దతు తెలుపుతున్నారు. దీనిలో భాగంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా కూల్చివేతలపై ఎవరైనా అడ్డొస్తే బుల్డోజర్లను ఎక్కించాలన్నారు. అంతేకాకుండా జెండా రంగులతో సంబంధం లేకుండా అక్రమ నిర్మాణాలను కూల్చాలని పేర్కొన్నారు. పెద్దలను వదిలి పేదల నిర్మాణాలను కూల్చితే సహించేది లేదన్నారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం చెరువులు, కుంటల ఆక్రమణల కూల్చివేతల క్రమంలో ఎంతటివారైనా వదిలిపెట్టకుండా హైడ్రా పారదర్శకంగా వ్యవహరించాలని ఎంపీ తెలిపారు. హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలోని అజీజ్ నగర్ లో వీఐపీలు, రాజకీయ ప్రముఖులు అక్రమంగా నిర్మించుకున్న కట్టడాలను కూల్చాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రభుత్వ భవనాలను సైతం కూల్చివేయాల్సిందే.