Home Page SliderInternational

తొలిసారి విమానంలో ఇంటర్నెట్ సేవలు..ఎలాగంటే..

విమానం ఎక్కగానే మీ మొబైల్స్, ల్యాప్‌ట్యాప్స్ స్విచ్చాఫ్ చేయమంటూ ఎయిర్ హోస్టెస్ హెచ్చరిస్తారు. కానీ ఇకమీదట విమానంలో ఇంటర్నెట్ సేవలు దొరికే అవకాశాన్ని విస్తారా విమానయాన సంస్థ కల్పిస్తోంది. వైఫై ద్వారా విమానంలో మొబైల్స్, ల్యాప్‌ట్యాప్‌లలో ఇంటర్నెట్ యాక్సిక్ చేసుకోవచ్చు. వైఫై వేగాన్ని బట్టి దానికి డబ్బు కూడా వసూలు చేస్తారు. విమానంలో శాటిలైట్ లేదా గ్రౌండ్ సిస్టమ్ ఆధారంగా వైఫైకి సిగ్నల్స్ వస్తాయి. వీటి ద్వారా అత్యవసర ఇంటర్నెట్ సేవలు పొందవచ్చు. ఇప్పుడిప్పుడే ఎయిర్ ఇండియా కూడా ఇంటర్నెట్ అందించే ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే పెద్ద వీడియోలు, ఫైల్స్ డౌన్‌లోడ్, హైక్వాలిటీ వీడియోలు చూసుకోవడానికి అనుమతించరు.