అమరావతిలో ప్రపంచబ్యాంకు ప్రతినిధులు..ముఖ్యమంత్రితో భేటీ
అమరావతి రాజధాని అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు నుండి రూ.15 వేల కోట్లను ఇప్పిస్తామని కేంద్రప్రభుత్వం బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన మాట తెలిసిందే. ఆ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. దీనికోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధుల బృందం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యింది. ఈ రెండు బ్యాంకుల ప్రతినిధులు ఈ నెల 27 వరకూ అమరావతిలో పర్యటిస్తారు. అమరావతి నగర అభివృద్ధి, ఆర్థిక సాయానికి సంబంధించిన అంశాలపై చర్చలు, పరిశోధనలు జరపనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, పురపాలక అభివృద్ధి మంత్రి నారాయణ ఈ భేటీలో పాల్గొన్నారు.

