ఆంధ్రకు కూడా ఐపీఎల్ టీమ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఐపీఎల్ టీమ్‌ను రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే ఐదేళ్లలో అమరావతి పేరుతో ఐపీఎల్ టీమ్‌ను ప్రమోట్ చేస్తామని ఏపీ మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్‌గా మారుస్తామని తెలిపారు. అన్ని విద్యాసంస్థలలోనూ ప్రతిరోజూ గంట పాటు క్రీడలకు సమయం కేటాయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. క్రీడా మైదానాలు లేకపోతే ప్రైవేట్ విద్యాసంస్థలపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఆటలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రజలను మభ్యపెట్టి ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో రూ.120 కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.