విద్యుత్ కమిషన్ చైర్మన్ మార్పుపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి విద్యుత్ కమిషన్ చైర్మన్ మార్పుపై కీలక ప్రకటన చేశారు. ఇటీవల విద్యుత్ కమిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు జడ్జ్ చంద్రచూడ్ తెలంగాణా విద్యుత్ కమిషన్ చైర్మన్‌ను మార్చాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎం ఇవాళ సాయంత్రలోగా విద్యుత్ కమిషన్‌కు కొత్త చైర్మన్‌ను నియమిస్తామన్నారు. కాగా విద్యుత్ రంగంలో న్యాయవిచారణ కోరింది బీఆర్ఎస్సే అని సీఎం ఆరోపించారు. అయితే బీఆర్ఎస్ నేతలు కమిషన్ ఎదుట ఎందుకు హాజరు కాలేదో చెప్పాలని సీఎం ప్రశ్నించారు.కాగా బీఆర్ఎస్ నేతలు కమిషన్ ఎదుట హాజరై వివరాలు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని సీఎం వారిని నిలదీశారు.