News

హాయ్ జగన్, అసెంబ్లీలో రఘురామ-జగన్ మధ్య ఆసక్తికర సంభాషణ

అసెంబ్లీ లాబీల్లో వైసీపీ అధినేత జగన్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మధ్య ఆసక్తికర చర్చ సాగింది. అసెంబ్లీకి రెగ్యులర్ గా రావాలని రఘురామ జగన్ ను కోరగా, అందుకు జగన్ బదులిచ్చారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుంటే ఎలా అంటూ రఘురామ జగన్ చేతిలో చెయ్యిసి కోరారు. అందుకు జగన్, ఇకపై మీరే చూస్తారుగా అంటూ బదులిచ్చారు. అసెంబ్లీలో జగన్ భుజంపై చేయి వేసి రఘురామ కొద్దిసేపు మాట్లాడారు. అసెంబ్లీలో తనకు జగన్ పక్కనే సీటు వేయాలని రఘురామ, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ ను కోరగా అందుకు ఆయన సరేనన్నారు. దీంతో అక్కడ నవ్వులు పూశాయి. అదే సమయంలో రఘురామను వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలకరించారు. జగన్ పై క్రిమినల్ కేసు పెట్టడంతో రఘురామ సంచలనంగా మారారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ఎంపీగా గెలిచి, రెబల్ గా వ్యవహరించిన రఘురామ, 2024 ఎన్నికల్లో ఉండి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తనకు స్పీకర్ పదవి లేదంటే, మంత్రి పదవి వస్తుందని ఆయన భావించారు.